ఆ రంగాన్ని సీఎం రేవంత్ రెడ్డి చేజేతులా నాశనం చేస్తున్నాడు : హరీశ్ రావు

-

కాంగ్రెస్ పాలన లో రైతులు, చేనేత కార్మికులు, ఆటో డ్రైవర్లతో పాటు ఇప్పుడు బిల్డర్లు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మాజీ మంత్రి హరీష్ రావు  ఆరోపించారు. శుక్రవారం ఎర్రవెల్లిలోని ఫామ్ హౌజ్లో కేసీఆర్తో కలిసి ముఖ్య నాయకులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. బీఆర్ఎస్  పాలనలో నిర్మాణ రంగానికి స్వర్గధామంగా ఉన్న హైదరాబాద్లో ఫ్లాట్లు అమ్ముడు పోలేదని బిల్డర్ ఉరేసుకునే పరిస్థితి రావడం దారుణమని అన్నారు.

కాంగ్రెస్ పాలనలో రైతులు, చేనేత కార్మికులు, ఆటో డ్రైవర్లు.. ఇప్పుడు బిల్డర్లు ఆత్మహత్యలు
చేసుకుంటున్నారని తెలిపారు. ఈ ఆత్మహత్యలన్నిటికీ ప్రత్యక్షంగా, పరోక్షంగా కాంగ్రెస్ నిర్లక్ష్య
పాలన, అనాలోచిత అసమర్థ విధానాలే కారణమని మండిపడ్డారు. శాంతి భద్రత దిగజారడం, పాలన పట్ల ప్రజల్లో నమ్మకం లేకపోవడం, అనుమతి ఉన్న ఇళ్లను సైతం హైడ్రా కూల్చివేయడం, మూసీ, ఫార్మా సిటీ, మెట్రో కారిడార్ల విషయంలో ద్వంద్వ ప్రకటనలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్  చేయకపోవడం, భవన నిర్మాణ అనుమతులకు బలవంతపు వసూళ్లు చేయడం, కొత్త పెట్టుబడులు రాకపోవడం, ఇతర రాజకీయ, ఆర్థిక పరిణామాలు రియల్ ఎస్టేట్ రంగం పై గడిచిన 14 నెలల కాంగ్రెస్
పాలనలో పెను ప్రభావాన్ని చూపాయని కీలక వ్యాఖ్య చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news