ఈసీ ఆపినా.. రైతుభరోసా రేపు వేసి తీరుతానని సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. నిన్న వరంగల్ లో ప్రచారం చేశారు సీఎం రేవంత్. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ…ఈసీ ఆపినా రైతుభరోసా ఈ నెల 9 తారీకులోగా వేసి తీరుతానన్నారు.
తెలంగాణ రైతుల రుణం తీర్చుకోడానికి రైతు భరోసా రైతుల ఖాతాలో వేస్తా అంటే వెయ్యొద్దని ఎన్నికల సంఘం నాకు ఇవాళ నోటీస్ ఇచ్చిందని వెల్లడించారు. అయినా ఏది జరగాలో అది జరిగి తీరుతుంది.. నగదు ఎక్కడికి చేరాలో అక్కడకి చేరితుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
పౌరుషానికి ప్రతీక అయిన సమ్మక్క సారలమ్మ మనకు ఆదర్శం అన్నారు. కాళోజీ నారాయణరావు, పీవీ నరసింహారావు, తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ జయశంకర్ వరంగల్ గడ్డ వారే.. తెలంగాణ ఉద్యమంలో కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు క్రియాశీలక పాత్ర పోషించారని గుర్తు చేసుకున్నారు.తులసి వనంలో గంజాయి ఉన్నట్లు ఎర్రబెల్లి, ఆరూరి రమేష్ లాంటి వారు వరంగల్ లో ఉన్నారని ఆగ్రహించారు.