మరో వివాదంలో హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి చిక్కుకున్నారు. హైదరాబాద్‌లో వర్షాలకు 9 మంది మృతి చెందితే పట్టించుకోకుండా.. తన ఫోటో బ్యానర్‌లో పెట్టనందుకు బాధపడ్డారు హైదరాబాద్ మేయర్ గద్వాల విజయ లక్ష్మి. గత సాయంత్రం నుండి హైదరాబాద్‌లో వర్షాలకు 9 మంది మృతి చెందగా, ఆరుగురుప్రాణపయ స్థితిలో ఉన్నారు.
సాయంత్రం నుండి హైదరాబాద్‌లో చాలా చోట్ల కరెంట్ లేదు.. చెట్లు విరిగి రోడ్డుపై పడి తీవ్ర ట్రాఫిక్ సమస్య తలెత్తింది. ఇంత జరిగినా ఈరోజు మధ్యాహ్నం అవుతున్న వీటి మీద కనీసం స్పందించలేదు హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి.. అదే తన ఫోటో బ్యానర్‌లో పెట్టకపోతే బాధపడుతుంది.
మనిషి ప్రాణాల కన్న తన ఫోటో బ్యానర్‌లో పడకపోవడమే మేయర్ గద్వాల విజయలక్ష్మికి ఎక్కువ బాధ కలిగించిందట. ఇప్పుడు ఇదే అంశం వైరల్ గా మారింది.