రాహుల్‌ను ప్రధాని చేయడం వైఎస్‌ఆర్‌ ఆశయం : సీఎం రేవంత్

-

వైఎస్‌ఆర్‌ చేసిన అభివృద్ధి, సంక్షేమం పేదలకు అందుతుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. మూసీ ప్రక్షాళన చేయాలనే ఆలోచన వైఎస్‌ఆర్‌ స్ఫూర్తితోనే ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు. గతంలో రాహుల్‌గాంధీని ప్రధాని చేయాలని వైఎస్‌ఆర్‌ సంకల్పించారన్న సీఎం.. ఆయణ్ను ప్రధాని చేస్తేనే పేదలకు సంక్షేమం అందుతుందని భావించారని చెప్పారు. వైఎస్‌ఆర్‌ స్ఫూర్తితోనే రాహుల్‌ను ప్రధానిని చేసే విధంగా మనం ముందుకువెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు. వైఎస్‌ఆర్‌ ఆశయం అంటే సంక్షేమం, అభివృద్ధి అని పేర్కొన్నారు.

గాంధీభవన్లో వైఎస్సార్ 75వ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడారు. ‘వైఎస్‌ఆర్‌ పాదయాత్రతో గతంలో కాంగ్రెస్‌ అధికారంలోకి తెచ్చింది. రాహుల్‌ పాదయాత్రతో పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. రాహుల్‌గాంధీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా రాణిస్తున్నారు. ఇటీవల పార్లమెంటులో మోదీ విధానాలను రాహుల్‌ ఎదుర్కొన్నారు. దేశ ప్రధాని పదవికి రాహుల్‌గాంధీ ఒక్క అడుగు దూరంలో ఉన్నారు. రాహుల్‌గాంధీని ప్రధానిని చేయడం వైఎస్‌ఆర్‌ ఆశయం. రాహుల్‌గాంధీని ప్రధానిగా చేయడం కోసం అందరూ అండగా నిలవాలి. రాహుల్‌ను ప్రధానిగా చేయడానికి ఎవరు అడుగులు వేస్తారో వారే నిజమైన వారసులు.’ అని రేవంత్ రెడ్డి అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news