అప్పులు ఉన్నా.. ఆర్థిక భారం ఉన్నా.. సోదరీ మణులకు ఉద్యోగాలు ఇస్తున్నాం అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రం నిరుద్యోగ యువతీ, యువకులకు సాకారం అన్నారు. ఉద్యోగాలు ఇవ్వడం వల్ల తెచ్చుకున్న రాష్ట్రానికి సార్థకత జరుగుతోంది. 6,956 మంది నిరుద్యోగ యువతీ, యువకులకు అవకాశాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ వేదిక మీద ఉన్న మేము ఇదే వేదిక మీద ప్రమాణం చేశాం.
మీరు కూడా ఎల్బీ స్టేడియంలో సంతోషం గడుపుతుంటే.. మీ కుటుంబ సభ్యులుగా.. మీ సంతోషంలో భాగస్వామ్యం కావడానికి వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. తెలంగాణ ఉద్యమం నిరుద్యోగుల సమస్యల కోసమే ప్రధానంగా నడిచింది. గత ప్రభుత్వం నిరుద్యోగుల గురించి ఆలోచన చేయలేదు. నిరుద్యోగుల కలలు నిజం చేయడంలో ఇది మొదటి అడుగు అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా ప్రజలు ఓడిస్తే.. కేసీఆర్ కి వెంటనే దు:ఖం వచ్చింది. ఎమ్మెల్సీగా మళ్లీ ఉద్యోగం ఇచ్చారు. కేసీఆర్ ఫ్యామిలీ ఉద్యోగాల గురించే ఆలోచించాడు.