సంవత్సరం లోపు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం అని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇవాళ ఎల్బీస్టేడియంలో స్టార్ నర్స్ ఉద్యోగానికి ఎంపికైన నిరుద్యోగులకు నియమాక పత్రాలను అందజేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే టీఎస్పీఎస్సీనీ ప్రక్షాళన చేసి.. నూతన చైర్మన్, సభ్యులను నియమించాం.
త్వరలో టీఎస్పీఎస్సీ నుంచి అన్ని శాఖలలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. త్వరలోనే 10వేల పోలీస్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ పునర్ నిర్మాణం కోసం పోరాడుతాం. స్టాప్ నర్స్ లు.. అంటే.. డాటర్లు మీరే.. డాక్టర్లు మీరే.. అన్నారు. ప్రతీ పేషెంట్ ఆరోగ్యంపై మీ శ్రమ, మీ కష్టం ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఉద్యోగాలు సాధించిన వారందరికీ అభినందనలు తెలియజేశారు. ప్రతి నిరుద్యోగి కలను సహకారం చేస్తామని తెలిపారు. అదేవిధంగా వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరిసింహకు కృతజ్ఞతలు తెలిపారు.