హైకోర్టును ఆశ్రయించిన తెలంగాణ సర్పంచ్ లు.. కారణం ఇదే..!

-

తెలంగాణలో సర్పంచ్ పదవీ కాలం జనవరి 31, 2024తో ముగిసిపోయింది. అయితే సర్పంచ్ ల పదవీకాలం పొడిగించాలని బీఆర్ఎస్ చేసిన విజ్ఞప్తిని ప్రభుత్వం పరిశీలనలోకి తీసుకోలేదు. ప్రత్యేక అధికారుల పాలనకు ఉత్తర్వులు జారీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. రాష్ట్రంలోని సర్పంచులు, ఉప సర్పంచుల నుంచి రికార్డులు, చెక్‌బుక్కులు, డిజిటల్‌ సంతకాల కీలను వెంటనే స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేసింది.

బుధవారం  నుంచి వారి వద్ద నుంచి  చెక్ బుక్కులు స్వాధీనం చేసుకోవాలని తెలిపింది. ఎవరైనా ఈ ఆదేశాలు పాటించకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది. తాజాగా సర్పంచ్ లు హైకోర్టును ఆశ్రయించారు. వెంటనే ఎన్నికలు నిర్వహించాలని.. ఎన్నికలు జరిగేంత వరకు తమను సర్పంచ్ లుగా కొనసాగించాలని పిటీషన్ లో పేర్కొన్నారు.

సర్పంచ్ ల పదవీకాలం ముగుస్తున్న సందర్భంలో ప్రత్యేక అధికారులకే అన్ని బాధ్యతలు అప్పగించబోతున్నారు. ఫిబ్రవరి 2 నుంచి  వీరందరూ విధుల్లో చేరతారు. చెక్ బుక్ లు, డిజిటల్‌ సంతకాలతో కూడిన పెన్ డ్రైవ్ లను వారి వద్దే ఉంచుతారు. ఇకపై ప్రత్యేకాధికారి, పంచాయతీ కార్యదర్శికి జాయింట్‌ చెక్‌పవర్‌ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అభివృద్ధి పనులకు సంబంధించి వారిద్దరి సంతకాలతో నిధులు డ్రా చేసుకోవచ్చని తెలిపింది. తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లు, ఎంపీడీవోలను ప్రత్యేక అధికారులుగా నియమించబోతోంది ప్రభుత్వం.

Read more RELATED
Recommended to you

Latest news