తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కామెంట్లపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. బీఆర్ఎస్ తీసుకున్న తెలంగాణ వ్యతిరేక నిర్ణయాలు తాము సరి చేస్తున్నామని సీఎం అన్నారు. సమైక్య రాష్ట్రంలో కంటే బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ఎక్కువగా నష్టపోయిందని ఆరోపించారు. ఈ క్రమంలో ‘మీ ఆనవాళ్లు లేకుండా చేస్తా. నా బాధ్యత’ అని రేవంత్ ప్రకటించారు. దీంతో బీఆర్ఎస్ ను ఉద్దేశించి సీఎం కామెంట్ చేశారా..? లేక పథకాలు, నిర్ణయాల గురించేనా..? అని ప్రజలు మాట్లాడుకోవడం విశేషం.
మరోవైపు కృష్ణా ప్రాజెక్టులపై సీఎం రేవంత్ సంచలన ఆరోపణలు చేశారు. ఏపీ ప్రభుత్వం నీళ్లు తరలించుకుపోతుంటే కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఏం చేశారని నిలదీశారు. శ్రీశైలం నుంచి ఏపీ రోజుకు 12.50/13 TMC లు తరలించే ప్రయత్నం చేస్తోంది. కానీ మనకు రోజుకు 2 టీఎంసీలు తరలించే ప్రాజెక్టు కూడా లేదు. నెల రోజులు మనం కళ్లు మూసుకుంటే శ్రీశైలంలో బురద కూడా ఉండదు. వీళ్లు జగన్ ను పిలిచి పంచభక్ష పరమాన్నం పెడితే ఆయన బొక్క పెట్టిండు అని ఫైర్ అయ్యారు.