తెలంగాణలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వే కుటుంబ సభ్యుల వివరాలతో ఇంటింటి సర్వే చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ సర్వే పై తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్ చేశారు. ” తెలంగాణ నేడు కులాల సర్వే గణన ప్రారంభంతో విప్లవ యాత్రకు శ్రీకారం చుట్టింది. మా నాయకుడు రాహుల్ గాంధీ వాగ్దానం మేరకు తెలంగాణలో అన్ని బలహీన వర్గాలకు సామాజిక న్యాయం సాకారం కానుంది.
ఈ రోజు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. అలాగే సామాజిక న్యాయం కోసం తదుపరి తరం కార్యక్రమాలు, పలు విధానాలలో భారతదేశంలో అగ్రస్థానంలో ఉండేలా మేము రాబోయే రోజుల్లో తీవ్రంగా కృషి చేస్తాం” అంటూ ట్వీట్ చేశారు రేవంత్ రెడ్డి. ఈ సర్వే పై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీల వారు పాజిటివ్ గా తీసుకుంటే.. ప్రతిపక్ష పార్టీల నేతలు ఈ సర్వేను నెగిటివ్ గా ప్రచారం చేస్తున్నారు. కొందరూ సర్వేను కొన్ని ఇండ్లను మాత్రమే చేస్తున్నారు. మరికొన్ని ఇండ్లను వదిలేసి చేయడం గమనార్హం.