అమెరికా పర్యటన ముగించుకుని సియోల్‌ చేరుకున్న సీఎం రేవంత్

-

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం అమెరికా పర్యటన ముగిసింది. అమెరికాలో 19 కంపెనీలతో సంప్రదింపులు, ఒప్పందాల ద్వారా రాష్ట్రానికి 31 వేల 532 కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దీనివల్ల రానున్న రోజుల్లో కొత్తగా 30వేల 750 ఉద్యోగాలు రానున్నట్లు వెల్లడించాయి. ఈనెల 3న అమెరికా పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం దాదాపు యాభైకి పైగా వ్యాపార సమావేశాలు, మూడు రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొంది.

ఈ పర్యటనలో కాగ్నిజెంట్, చార్లెస్ స్క్వాబ్, ఆర్సీసియం, కార్నింగ్‌, ఆమ్జెన్, జొయిటిస్, హెచ్సీఏ హెల్త్ కేర్, వివింట్ ఫార్మా, థర్మో ఫిసర్, ఆరమ్ ఈక్విటీ, ట్రైజిన్ టెక్నాలజీస్, మోనార్క్, ట్రాక్టర్, అమెజాన్ కంపెనీలు రాష్ట్రంలో విస్తరణకు, కొత్త కేంద్రాలు నెలకొల్పేందుకు ముందుకొచ్చాయి. ఇక అమెరికా పర్యటన అనంతరం ఆయన దక్షిణ కొరియా రాజధాని సియోల్కు చేరుకున్నారు. హ్యుందాయ్, యూయూ ఫార్మా కంపెనీలు, శాంసంగ్, ఎల్‌జి తదితర కంపెనీ ప్రతినిధులతో సీఎం రేవంత్‌ రెడ్డి చర్చలు జరపనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news