త్వరలో జిల్లాల పర్యటనకు సీఎం రేవంత్!

-

తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్‌ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారట. త్వరలో జిల్లాల పర్యటనకు సీఎం రేవంత్ వెళ్లానున్నారట. జిల్లా స్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు CM రేవంత్ త్వరలో జిల్లాల్లో పర్యటించనున్నారు. ఒక్కో జిల్లాలో ఒకటి లేదా రెండు రోజులపాటు పర్యటించే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

CM Revanth to visit the districts soon

స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ నేతలను సిద్ధం చేసేందుకు ఈ టూర్ ఉపయోగపడుతుందని ఆయన భావిస్తున్నారట. అలాగే సంక్షేమ పథకాల అమలు, అధికారుల పనితీరు గురించి తెలుసుకోవచ్చని యోచిస్తున్నట్లు సమాచారం.

అటు ఆగస్టు 15లోపు రూ.2 లక్షల రుణమాఫీ అమలుపై సర్కార్ కసరత్తు ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే విధివిధానాల ఖరారుకు మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. ఈ నెల 15వ తేదీ లేదా 18వ తేదీన సమావేశం జరిగే అవకాశం ఉంది. రుణమాఫీ అమలుకు అవసరమైన ప్రభుత్వపరమైన నిర్ణయాలపై సమావేశంలో చర్చించి వెల్లడించనున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version