CM Revanth’s meeting with BRS party leaders: నేడు సచివాలయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో పలు రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కానున్నారు సిఎం రేవంత్ రెడ్డి.
తెలంగాణ రాష్ట్ర చిహ్నం, గీతంలపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై రాజకీయ పార్టీలకు వివరించనున్నారు సిఎం రేవంత్ రెడ్డి. అయితే.. ఈ సమావేశానికి బీఆర్‌ఎస్ పార్టీ నేతలకు ఆహ్వానం పంపుతారా ? లేక సీపీఐ, సీపీఎం పార్టీలతోనే సీఎం రేవంత్ రెడ్డి చర్చిస్తారా అనేది తేలాల్సి ఉంది.