టాలీవుడ్ నటుడు అక్కినేని నాగార్జునకి సంబందించిన N కన్వెన్షన్ నిన్న కూల్చివేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. చెరువుల్లో అక్రమ నిర్మాణాలను వదిలేసేది లేదు.. ఒత్తిడి వచ్చినా.. మిత్రులకు ఫాంహౌస్లు ఉన్నా వదలం. అక్రమణదారుల చర నుంచి చెరువులకు విముక్తి కలిగిస్తాం. అక్రమ కట్టడాలకు స్ఫూర్తి భగవద్గీతే.. చెరువుల్లో శ్రీమంతులు ఫాంహౌస్లు కట్టుకున్నారు. వారి డ్రైనేజీని చెరువుల్లో కలుపుతున్నారు.
రాజకీయం కోసమే.. నాయకులపై కక్ష్యకోసం కూల్చివేతలు చేయడం లేదు. అక్రమ నిర్మాణాలు వదిలేస్తే నేను ప్రజా ప్రతినిధిగా విఫలమైనట్టేనని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. శ్రీకృష్ణుడి గీతాబోధన అనుసారమే ఈ అక్రమ నిర్మాణాల కూల్చివేత అని తెలిపారు. చెరువుల ఆక్రమణదారుల్లో ప్రభుత్వాలను ప్రభావితం చేసేవారున్నారు. ప్రత్యక్షంగా ప్రభుత్వంలో భాగస్వాములైన వారు కూడా ఉండవచ్చు. సమాజాన్ని ప్రభావితం చేసేవారు ఉండవచ్చు. వారెవరిని పట్టించుకోను. ఎవరు ఎంత ఒత్తిడి తెచ్చినా చెరువులను ఆక్రమించిన వారి భరతం పడతామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.