ప్రజావాణి పై సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 2023 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు 117 సార్లు ప్రజావాణి నిర్వహించామని అధికారులు తెలిపారు. ప్రజావాణిలో 54,619 అర్జీలు ప్రజలు నమోదు చేసుకున్నారు. వీటిలో 68.4 శాతం అర్జీలు పరిష్కారమయ్యాయి. ప్రజావాణి అర్జీలను పరిష్కరించేందుకు మరింత పారద్శకమైన విధానాలు అమలు చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
ప్రజావాణి డ్యాష్ బోర్డు యాక్సెస్ ను తనకు అందించాలని సీఎం కోరారు. లైవ్ యాక్సెస్ ఉండేలా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అర్జీల వివరాలతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల సమాాచారాన్ని ఆన్ లైన్ లో ఉంచాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.