కలెక్టర్ గారు ఈ షాపు పర్మినెంట్ చేయండి : సీఎం చంద్రబాబు

-

గుంటూరు జిల్లాలో ఇవాళ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించారు. తాడికొండ మండలం పొన్నెకల్లులో అకస్మాత్తుగా ఓ చిన్న దుకాణం వద్ద ఆగాడు. అక్కడ ఉన్న బుర్రా చిన్నమ్మాయితో మాట్లాడారు. కుటుంబం, జీవనోపాధి పై వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారి దుస్థితి ని విని వారికి ఉపాధి కల్పించే ఏర్పాట్లు చూడాలని కలెక్టర్ కి ఆదేశాలు జారీ చేశారు. ఆరోగ్యం బాగోలేక పొలానికి పోలేక ఈ చిన్న టీ షాపు పెట్టుకున్నానయ్యా అని చెప్పడంతో సీఎం చంద్రబాబు చలించిపోయారు.

కలెక్టర్ గారు ఈ షాపు లాభం లేదని.. ఫర్మినెంట్ షాపు చేయండని సూచించారు. అలాగే ఆమె భర్త కి కావాల్సిన పెన్షన్ సదుపాయాలను చూడండి అని కలెక్టర్ ఆదేశించారు సీఎం చంద్రబాబు. అంతకు ముందు ఒకే కుటుంబానికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు నవీన్ మెకానిక్ షాపు నిర్వహించే ప్రవీణ్ కార్పేంటర్ గా పని చేసే అశోక్ ను కలిశారు. వారికి పక్కా ఇల్లు నిర్మించడమే కాకుండా అధునాతన పరికరాలు సమకూర్చుతానని హామీ ఇచ్చారు సీఎం చంద్రబాబు.

Read more RELATED
Recommended to you

Latest news