హైదరాబాద్‌లో కాగ్నిజెంట్ మరో సెంటర్.. వీ హబ్‌లో వాల్స్ కర్రా హోల్డింగ్స్ రూ.42 కోట్ల పెట్టుబడి

-

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన బిజీబిజీగా కొనసాగుతోంది. ఈ పర్యటనలో ఆయన వివిధ కంపెనీల ప్రతినిధులను కలుస్తూ రాష్ట్రంలో పెట్టుబడులకు ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలోనే సోమవారం రోజున అమెరికాలోని పలువురు పారిశ్రామికవేత్తలతో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ప్రముఖ ఐటీసంస్థ కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్‌తో సీఎం రేవంత్ టీమ్ భేటీలో.. ఆ కంపెనీ హైదరాబాద్‌లో 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో మరో కేంద్రం నెలకొల్పేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. కాగ్నిజెంట్ విస్తరణతో సుమారు 15 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

మరోవైపు అమెరికాకు చెందిన వాల్ష్‌కర్రాహోల్డింగ్స్‌ వీ- హబ్‌లో 42 కోట్ల పెట్టుబడి పెట్టేందుకి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. రానున్న ఐదేళ్లలో వీ-హబ్‌తో పాటు తెలంగాణలో నెలకొల్పే స్టార్టప్‌లలో.. దాదాపు 839 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు వాల్ష్‌కర్రాహోల్డింగ్స్‌ ప్రకటించింది. మరోవైపు ఈ పర్యటనలో సీఎం రేవంత్‌రెడ్డి, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్‌బాబు న్యూయార్క్ స్టాక్‌ ఎక్స్చేంజ్‌ని సందర్శించారు. ఈనెల 10 వరకు ముఖ్యమంత్రి అమెరికా పర్యటన కొనసాగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news