నేడు బీజేపీ రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షుల సమావేశం

-

నేడు బీజేపీ రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షుల సమావేశం జరగనుంది. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్‌రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు జరగనున్న ఈ భేటీలో హర్‌ఘర్ తిరంగా, స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించనున్నారు. తాజా రాజకీయ పరిణామాలపైనా చర్చలు జరపనున్నట్లు సమాచారం.

అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో గతం కంటే మెరుగైన ఫలితాలు సాధించి ఓటు బ్యాంకును పెంచుకున్న బీజేపీ ప్రస్తుతం గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. క్షేత్రస్థాయిలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాషాయజెండా ఎగరవేస్తే రాష్ట్ర పీఠాన్ని సునాయసంగా కైవసం చేసుకోవచ్చని భావిస్తోంది. ఈ క్రమంలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందుకు ప్రణాళికలు రచిస్తోంది. రానున్న ఎన్నికల్లో అత్యధిక గ్రామపంచాయతీలను తమ ఖాతాలో వేసుకోవాలని వ్యూహాలపై ఈ భేటీలో చర్చించనున్నారు. రాష్ట్రంలో గ్రామ స్థాయిలో బీజేపీ బలహీనంగా ఉందని.. స్థానిక సంస్థల ఎన్నికలను ఉపయోగించుకుని.. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారం చేపట్టాలని సుదీర్ఘమైన ప్రణాళికతో ముందుకు వెళ్లేందుకు సమాయత్తమవుతోంది. ఈ క్రమంలోనే క్షేత్రస్థాయిలో బీజేపీని బలంగా తయారు చేసేందుకు పక్కా ప్లాన్స్ రచిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news