ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ్ కమిటీ , శ్రీ గణేష్ ఉత్సవ్ కమిటీ మధ్య విభేదాల నేపథ్యం లో అడ్ హాక్ పేరుతో కొత్త కమిటీ ఏర్పాటు చేసామని ప్రకటించారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. రెండు కమిటీ ఆలోచనలను పెరిగినలోకి తీసుకున్నామని.. అందరు ఉత్సవ కమిటీ సభ్యులేనని తెలిపారు. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని… ఈ ఏడాది 70 సంవత్సరం కావడం తో మరింత ఘనంగా ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు.
ఉత్సవాలకు వచ్చే భక్తుల కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తామని వివరించారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. ఉత్సవ కమిటీ ని 5 విభాగాలుగా చేసి ఉత్సవాలు నిర్వహించేలా బాధ్యతలు అప్పగిస్తామని… డొనేషన్స్ నుండి వచ్చే డబ్బు ను రోజు డిస్ప్ల్య్ చేస్తామని ప్రకటించారు. విద్యా, ఆర్థిక స్థోమత లేని వారికీ సహాయం అందిస్తామన్నారు. మల్టి పర్పస్ కమ్మూనిటి హాల్ కట్టబోతున్నామని… ఇక్కడ ఖైరతాబాద్ వాసులు నామినల్ ఫీ కట్టి హాల్ ను వినియోగించుకోబెందుకు సౌకర్యాలు ఉంటాయని వివరించారు. నేను అధ్యకత వహిస్తున్నాం… కొత్త కమిటీ లో రాజ్ కుమార్ చైర్మన్ ఉంటారని తెలిపారు. 100 మందితో అడ్ హాక్ ఉత్సవ్ కమిటీ లో సభ్యులు ఉంటారన్నారు.