కరోనా తో మ‌ర‌ణించిన వారికి ప‌రిహారం! ద‌ర‌ఖాస్తు ఇలా

-

క‌రోనా తో మ‌రణించిన వారికి ప‌రిహారంగా రూ. 50 వేలు చెల్లించాల‌ని సుప్రీం కోర్టు ఆదేశాల‌తో కేంద్ర ప్రభుత్వం ప‌రిహారాన్ని చెల్లించే ప్ర‌క్రియ ను మొద‌లు పెట్టింది. అయితే దీనికి ముందుగా కరోనా తో చ‌నిపోయిన్టు డెత్ స‌ర్టిఫీకెట్ అవ‌స‌రం. కాబ‌ట్టి తెలంగాణ ప్ర‌భుత్వం డెత్ స‌ర్టిఫీకెట్ల కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి అవ‌కాశం ఇచ్చింది.

ఈ ప్ర‌క్రియ ను తెలంగాణ ప్ర‌భుత్వం మంగ‌ళ వారం నుంచి ప్రారంభం అయింది. అలాగే డెత్ స‌ర్టిఫికెట్ ఉన్న వారు రూ. 50 వేల ప‌రిహారం కోసం నేరుగా మీసేవ నుంచి ద‌రఖాస్తు చేసు కోవాలి. అలాగే మృతుల కుటుంబసభ్యులు పంచాయతీ లేదా మున్సిపాల్టీ నుంచి డెడ్ సర్టిఫికేట్, కోవిడ్ పాజిటివ్ రిపోర్టును దరఖాస్తుతో పాటు జత చేయాలి. ఒకవేళ పాజిటివ్ రిపోర్టు లేకపోతే క‌రోనా వైరస్ కారణంగా ఆస్ప‌త్రి లోఅడ్మిట్ అయితే.. ఆసుపత్రి నుంచి మరణాన్ని ధృవపరిచే మెడికల్ సర్టిఫికేట్ ను జత చేయాలి.

ఆ స‌ర్టిఫీకెట్ కూడా కరోనా చికిత్సలో చేసిన పరీక్షల బిల్లులు తో పాటు ఇంకా ఏదైన పేపర్లు ఉంటే వాటిని సమర్పించాలి. అలాగే బ్యాంకు అకౌంట్, పైన చెప్పిన‌ ధృవపత్రాలతో రూ. 50 వేల పరిహారం కోసం మీ సేవ కేంద్రాల‌లో దరఖాస్తు చేయాలి. వీటిని ప‌రిశీలించ‌డానికి ముగ్గురు తో ఒక క‌మిటీ ఉంటుంది. వారు ద‌ర‌ఖాస్తును ప‌రిశీలిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news