తెలంగాణ ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షీ నటరాజన్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఇలాగే స్ట్రిక్ట్ గా
ఉంటానని.. నాతీరు నచ్చకపోతే అధిష్టానానికి ఫిర్యాదు చేయడంలో తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆమె పేర్కొన్నారు. నేడు కాంగ్రెస్ అనుబంధ సంఘాలతో మీనాక్షీ నటరాజన్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయా సంఘాల పని తీరుపై నేతలు నివేదికలు మీనాక్షికి సమర్పించారు. భేటీ అనంతరం ఆమె మాట్లాడుతూ.. మీరు నివేదికలు ఎలా ఇచ్చినా. అసలు ఇవ్వకపోయినా తనకు పనితీరు తెలుస్తుందని తెలిపారు. ఎవరు పని చేస్తున్నారో, ఎవరు యాక్టింగ్ చేస్తున్నారో కూడా తనకు సమాచారం అందుతుందని అన్నారు. పార్టీ అభివృద్ధికి పని చేయాలని.. పార్టీ అంతర్గత వ్యవహారాలను బయట చర్చించకూడదని హితవు పలికారు.
ఎవరైనా హద్దుమీరి అలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని మీనాక్షీ హెచ్చరించారు. ఒకవేళ నా
పనితీరు నచ్చకపోయినా రాహుల్ గాంధీ కి, సోనియా గాంధీకి ఫిర్యాదు చేయవచ్చని, దానిపై తనకు ఎలాంటి అభ్యంతరం లేదని వెల్లడించారు. ఏ చర్చ అయినా అతర్గతంగా ఉండాలని, బయట మాట్లాడి ఇతరులకు అవకాశం ఇవ్వకూడదని మీనాక్షీ నటరాజన్ నేతలకు సూచించారు. కాగా మీనాక్షీ ఏఐసీసీ ఇన్ఛార్జిగా నియమితులైనప్పటి నుంచి పార్టీ నేతలతో పలు సమీక్షలు నిర్వహిస్తున్నారు.