రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే విజయవంతంగా నిర్వహించాలని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. మంగళవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లా మధిర తహసీల్దార్ కార్యాలయం నుంచి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పై సీఎస్ శాంతి కుమారి ఉన్నతాధికాులతో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. సమగ్ర ఇంటింటి సర్వే నిర్వహణకు తయారు చేసిన ప్రణాళిక సర్వే ఉద్దేశం, జిల్లా స్థాయిలో కలెక్టర్ లు తీసుకోవాల్సిన చర్యలు వంటి అంశాలపై డిప్యూటీ సీఎం వివరించారు.
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సమగ్ర ఇంటింటి సర్వే నిర్వహణ విధి, విధానాలను కేబినెట్ సమావేశంలో చర్చించి ఆమోదించామని తెలిపారు. ప్రజా ప్రభుత్వం ఉన్నతమైన ఆలోచనతో సమగ్ర ఇంటింటికి కుటుంబ సర్వే చేపడుతుందని ఎస్సీ, ఎస్టీ ఇతర బలహీన వర్గాల అభ్యున్నతి కోసం వివిధ సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ అవకాశాల వారికి మెరుగుపరచడానికి తగిన ప్రణాళికలు తయారు చేసేందుకు ఈ సర్వే ఉపయోగిస్తామని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు.