Telangana Budget 2024 : తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ ఉదయం 9 గంటలకు తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం ఉండనుంది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌కు ఆమోదం తెలపనుంది మంత్రి మండలి.
ఇక అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇక తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2.80 లక్షల కోట్లుగా ఉండే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఇక అటు ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు శాసన మండలి సమావేశం ప్రారంభం కానుంది. ఇక మండలిలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు మంత్రి శ్రీధర్ బాబు.