కాంగ్రెస్, బీజేపీ రెండు దేశ ద్రోహీ పార్టీలేనని బీఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజల సమస్యలు పరిష్కరించడం ప్రభుత్వాల బాధ్యత అన్నారు. సీఎం, మంత్రులు, అధికారుల్లో సమన్వయ లోపం కనబడుతుందన్నారు. రైతు భరోసా రూ.12వేలకు బదులు ఇచ్చిన హామీ ప్రకారం.. రూ.15వేలు ఇవ్వాలన్నారు.
మహిళలకు యువతకు భరోసా, నిరుద్యోగ భృతి మరిచిపోయినట్టున్నారని ఎద్దేవా చేశారు. ఆటో కార్మికులను ఆదుకొని వారికి అండగా నిలవాలని సూచించారు. వ్యవసాయానికి తప్పనిసరిగ్గా 24 గంటల విద్యుత్ ఇవ్వాలన్నారు. బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం జలాలను వరుసగా 8 కార్లకు అందించినం. కాంగ్రెస్ రైతులకు నీళ్లు అందించడంలో విఫలమై పంటలు ఎండబెట్టే పరిస్తితి వచ్చిందన్నారు. ప్రజల పక్షాన కొట్లాడేందుకు బీఆర్ఎస్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజల యోగక్షేమాలు చూడటంలో కేసీఆర్ ను మించిన వాళ్లు లేరన్నారు. హామీలు అన్నీ అమలు చేయడంలో ఇక్కడి మంత్రులు, ఇన్ చార్జీ మంత్రి తుమ్మల ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.