కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించేది అప్పుడే..?

-

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కోడ్ వచ్చినప్పటి నుంచే పలు రాజకీయ పార్టీలు ప్రచారంలో మునిగిపోయాయి. ఇక  ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ తమ తమ అభ్యర్థుల జాబితాకు తుది మెరుగులు దిద్దుతున్నాయి. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పని చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిపై కాస్త ఆచితూచి వ్యవహరిస్తోంది. గెలిచే సత్తా ఉన్న వారినే బరిలోకి దించేందుకు ప్రయత్నాలు చేస్తుంది. అభ్యర్థుల జాబితాపై స్క్రీనింగ్ కమిటీ ముమ్మర కసరత్తు చేస్తోంది. 

శుక్రవారం సాయంత్రం 4 గంటలకు కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. కాంగ్రెస్ అభ్యర్థులను కేంద్ర ఎన్నికల కమిటీ ఖరారు చేసినా బస్సు యాత్ర తరువాతనే ప్రకటించే అవకాశముంది. ఈ నెల 14 తరువాత మరికొన్ని చేరికలు ఉండే అవకాశముంది. చివరి నిమిషంలో చేరికలు కూడా ఉంటాయని తెలుస్తోంది. అభ్యర్థుల జాబితాను ఒకేసారి ప్రకటించే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. 

ఢిల్లీలో జరిగే కేంద్ర కమిటీ సమావేశానికి పలువురు కాంగ్రెస్ నాయకులు హాజరు కానున్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క, తెలంగాణ కాంగ్రెస్ ఇన్ చార్జీలు థాక్రె ఈ సమావేశంలో పాల్గొననున్నారు. తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా దాదాపు రేపే ఖరారయ్యే అవకాశం కనిపిస్తోంది. 

Read more RELATED
Recommended to you

Latest news