మారుమూల కోడంగల్ కి కాంగ్రెస్ సీఎం పదవీని ఇచ్చింది : సీఎం రేవంత్ రెడ్డి

-

నాలుగు నెలల్లో నేను ఏ ఒక్క రోజు అయినా నేను సెలవు తీసుకున్నానా..? నామినేషన్ కి వచ్చిపోయినా..? ఇప్పటి వరకు నేను రాలేదు.. మారుమూల కోడంగల్ కి కాంగ్రెస్ సీఎం పదవీని ఇచ్చింది. కేసీఆర్ లా ఫామ్ హౌస్ లో పడుకోకుండా ప్రజల్లోకి వెళ్తున్నాం. బీజేపీ, బీఆర్ఎస్ దొంగ దెబ్బతీయాలని కుట్ర చేస్తున్నాయి. మా పాలిటెక్నిక్ కళాశాల తెచ్చుకుంటే.. ఎందుకు అడ్డం పడుతున్నావు తల్లి.. కోస్గిలో మహిళా డిగ్రీ కళాశాలను ఎందుకు ఇవ్వలేదన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఎవ్వరూ లేరు..
పదేళ్ల నుంచి ప్రధాని మోడీ ప్రధాని ఉన్నారు. జాతీయ హోదా తీసుకురాలేదన్నారు. కృష్ణా జలాలు, రైల్వే లైన్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ కి డీకే అరుణ జాతీయ హోదా ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు. మక్తల్ ఎత్తిపోతల ఆనాడు డీకే అరుణ అడ్డు పడ్డారు. శత్రువు చేతిలో సురకత్తినై డీకే అరుణ పాలమూరు ప్రజల కడుపులో కత్తితో పొడుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్వకుర్తి, నెట్టంపాడు, కోయిల్ సాగర్, జూరాల వంటి ప్రాజెక్టులు బీఆర్ఎస్ హయాంలో పూర్తి కాలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news