HCU కి భూములు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే.. బీజేపీ ఎంపీ కీలక వ్యాఖ్యలు

-

గతంలో HCU కి భూములు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. HCU భూముల అంశంలో తెలంగాణ బీజేపీ ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఇంట్లో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ఎంపీలు రఘునందన్ రావు, ఈటల రాజేందర్, హెచ్సీయూ రిజిస్ట్రార్, వీసీ జగదీశ్వర్ రావు హాజరయ్యారు. సమావేశం అనంతరం ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మీటింగ్ లో చర్చకు వచ్చిన అంశాల గురించి ప్రస్తావించారు.

HCUకి 2434 ఎకరాల భూమిని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చిందని.. పలు కారణాల వల్ల ఇందులో చాలా భూమి పోయిందని అన్నారు. ప్రభుత్వం కొంత భూమిని తిరిగి తీసుకోవడం.. గచ్చిబౌలి స్టేడియంకు కొంత కేటాయించడం, ఎమ్మార్వో ఆఫీస్, నవోద స్కూల్, మున్సిపల్ ఆఫీస్ కి కేటాయించడం.. కొంత భూమి ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి పోవడం లాంటివి జరిగాయని తెలిపారు. ఇప్పటికీ ఎన్ని ఎకరాలు ఉన్నాయి. భూములు ఎవరెవరికీ ఇచ్చారు. సర్వే చేసే అవకాశం ఉందా..? అనే అంశాలపై చర్చ జరిపామని తెలిపారు. లీగల్ డాక్యుమెంట్స్ ను కూడా పరిశీలించామని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news