దశాబ్దాల సాంప్రదాయాన్ని కాంగ్రెస్ తుంగలో తొక్కింది.. వేముల ప్రశాంత్ సంచలన వ్యాఖ్యలు

-

దశాబ్దాల సాంప్రదాయాన్ని కాంగ్రెస్ తుంగలో తొక్కిందని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నిన్న అసెంబ్లీ లో మూడు కమిటీ లు ఏర్పాటు చేసి బులెటిన్ విడుదల చేశారు. ఇందులో పీఏసీ చైర్మన్ పదవీ చాలా కీలకం అన్నారు. ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపేందుకే PAC పని చేస్తోంది. ఈ ఛైర్మన్ పదవి ప్రతిపక్ష పార్టీల కు ఇవ్వడం సంప్రదాయం గా వస్తుంది. కానీ బీఆర్ఎస్ నుంచి గెలిచి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కి ఈ పదవి ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపే పదవీ కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే కు ఇవ్వడం దురదృష్టకరం అన్నారు. ప్రజా స్వామ్యాన్ని ఖూని చేశారు. లెక్క ప్రకారం.. ముగ్గురు సభ్యులు బీఆర్ఎస్ నుంచి ఉండాలి. అసెంబ్లీ నియమావళికి, పార్లమెంట్ స్పూర్తికి కాంగ్రెస్ విరుద్ధంగా వ్యవహరిస్తోంది.  పీఏసీ కమిటీ ఏర్పాటు చేసే నాటికి బీఆర్ఎస్ సభ్యుల సంఖ్య 38. దేశంలో అయినా.. రాష్ట్రంలో అయినా ప్రతిపక్ష నేతకే పీఏసీ పదవీ ఉంటుందని పేర్కొన్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news