జీవన్ రెడ్డి ఆవేదన చూసిన తర్వాత చాలా బాధ అనిపించింది అనో కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి అన్నారు. ఏం జరుగుతుందో నాకు అర్ధం అవ్వడం లేదు.. ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. ఏమి అర్ధం కాక.. ఏమి మాట్లాడలేక పోతున్న. జీవన్ రెడ్డిని చూసిన తర్వాత.. ఈ వయసులో ఆయనకు ఈ ఆవేదన ఏంటి అని మనసు కలుక్కు మన్నది. జీవన్ రెడ్డికి… ఈ మాత్రమైనా జగ్గారెడ్డి అండగా ఉన్నాడు అని చెప్పడానికి.. నా మనసులో మాట మీడియా ద్వారా తెలియజేస్తున్నా అని అన్నారు.
అలాగే నేను ఎవరిని తప్పుపట్టడం లేదు. కానీ జీవన్ రెడ్డి నేను ఒంటరి అని అనుకోవద్దు. సమయం వచ్చినప్పుడు జీవన్ రెడ్డి వెంట జగ్గారెడ్డి ఉంటాడు. ఆయన కాంగ్రెస్ వాది.. జీవన్ రెడ్డి జీవితం అంతా కష్టాలే. ఎప్పుడు జనంలో ఉండే ఆయన్ని జగిత్యాల ప్రజలు ఎందుకు ఒడగొట్టారో అర్థం కానీ పరిస్థితి. సంగారెడ్డిని ఎంతో అభివృద్ధి చేసిన నన్ను ఎందుకు ఓడగొట్టారో అర్థం కాలేదు. అయితే పార్టీని కానీ.. ప్రజలను కానీ తప్పుపట్టడం లేదు. మా టైం బాగోలేదు కాబట్టి.. ఎవరేం చేస్తారు అని సర్డుకుపోతున్న. కానీ జీవన్ రెడ్డి వయసుకు.. నా వయసుకి తేడా ఉంది. ఈ వయసులో ఆయనకు ఇలాంటి రాజకీయ ఇబ్బందులు రావడం బాధాకరంగా అనిపించింది అని జగ్గారెడ్డి అన్నారు.