నాకు ఫామ్ హౌస్ ఎక్కడ ఉందో కేటీఆర్ చూపించాలి..!

-

నీలాగా రాజభోగాలు అనుభవించేందుకు నాకు ఫామ్ హౌస్ లేదు కేటీఆర్ అని కాంగ్రెస్ లీడర్ మధుయాష్కీ గౌడ్ అన్నారు. వారానికి నాలుగు సార్లు వెళ్లి ఎంజాయ్ చేయడానికి నీకు జన్వాడలో ఫామ్ హౌస్ ఉంది. 111 జీవో కు వ్యతిరేకంగా నిర్మించిన నీవు.. ఆ ఫామ్ హౌస్ ను బినామీ పేర్లతో మెయింటెన్ చేస్తున్నావ్. నీలాగా నాకు అలా విలాసవంతమైన ఫామ్ హౌస్ లు లేవు కేటీఆర్. నేను ప్రజల్లో ఉండేటోన్ని.. అందరిలా సాధారణ జీవితాన్ని లీడ్ చేస్తాను అని పేర్కొన్నారు.

అలాగే మాకు గండిపేట దగ్గర మామిడి తోట, సపోటా తోట ఉన్న మాట వాస్తవం. కానీ అక్కడ వాచ్ మెన్ కుటుంబం ఉండడం కోసం పాతబడిన చిన్న నిర్మాణం తప్పా.. ఫామ్ హౌస్ లేదు. అయినా FTL, బఫర్ జోన్లలో వ్యవసాయం, తోటల పెంపకం చేయొచ్చు అనే కనీస అవగాహన నీకు లేనట్లుంది. కానీ నాకు ఫామ్ హౌస్ ఉన్నట్లు.. అది FTL, బఫర్ జోన్లలో ఉన్నట్లు కేటీఆర్ ఇటీవల పలుమార్లు ప్రస్తావించడం సిగ్గుచేటు. అయినా నాకు ఫామ్ హౌస్ ఎక్కడ ఉందో.. ఎంత విలాసంగా నిర్మించుకున్నానో కేటీఆరే చూపించాలి అని మధుయాష్కీ సవాల్ విసిరారు.

Read more RELATED
Recommended to you

Latest news