నేడు తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేతల ప్రచారం ఉండనుంది. నర్సపూర్ లో సాయత్రం 4.30 కు ఎన్నికల ప్రచారంలో పాల్గోననున్నారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. నేడు మూడు నియోజకవర్గాల్లో ప్రియాంక గాంధీ ప్రచారం చేయనున్నారు. భువనగిరి, గద్వాల్, కొడంగల్ లో ప్రచారం చేయనున్న ప్రియాంక గాంధీ…ఉదయం 11.30 గంటలకు భువనగిరి సభలో పాల్గొననున్నారు.

మధ్యాహ్నం 1.30గంటలకు గద్వాల్ సభలో ప్రసంగించనున్న ప్రియాంక గాంధీ….మధ్యాహ్నం 3.30 గంటలకు కొడంగల్ లో భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.
12.30 గంటలకు ఆదిలాబాద్,3.30 గంటలకు నిజామాబాద్ లలో ప్రచార సభలలో పాల్గొంటారు చత్తిస్ ఘడ్ సిఎం భూపేష్ భగేల్. అటు నేడు మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం చేయనున్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఇల్లందు, డోర్నకల్, కొడంగల్ నియోజకవర్గాల్లో ప్రచార సభల్లో పాల్గొననున్న రేవంత్
ఉదయం 10గంటలకు ఇల్లందు బహిరంగసభలో పాల్గొంటారు. నేడు గాంధీ భవన్లో ఉదయం 11.30 గంటలకు ఏఐసీసీ జాతీయ నాయకులు, రాజస్థాన్ ఎమ్మెల్యే సచిన్ పైలట్ ప్రెస్ మీట్ ఉండనుంది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మధ్యాహ్నం 1 గంటకు మాజీ కేంద్ర మంత్రి, ఎంపీ జైరాం రమేష్ ప్రెస్ మీట్, మద్యాహ్నం 3 గంటలకు కర్ణాటక మంత్రి లక్ష్మీ హెబ్బాల్కర్ ప్రెస్ మీట్ గాంధీ భవన్ లో ఉంది.