కాంగ్రెస్ అంటే కరెంట్.. కరెంట్ అంటే కాంగ్రెస్ అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. 320 మందికి ఇవాళ నియామక పత్రాలు అందజేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో పాటు మిర్యాల గూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి చేతుల మీదుగా యాాద్రి థర్మల్ విద్యుత్ ప్రాజెక్ట్ కి భూములు ఇచ్చిన వారికి ఉద్యోగ నియామక పత్రాలను తాజాగా ప్రజాభవన్ లో అందజేశారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. 2013లో భూసేకరణ లాంటి గొప్ప చట్టం తీసుకొచ్చారు. ఆనాడు భూములు ఇచ్చింది ఇందిరమ్మే అని గుర్తుకు చేశారు. ఆ చట్టం వల్లే ఇప్పుడు మీకు న్యాయం చేస్తున్నామని తెలిపారు. యాదాద్రి థర్మల్ విద్యుత్ ప్రాజెక్ట్ కి భూములు ఇచ్చిన రైతులకు ఉద్యోగాలు కల్పించినట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
దాదాపు 500 మంది నిర్వాసితులకు ఉద్యోగాలు కల్పిస్తున్నామని తెలిపారు. తెలంగాణ ఇంటిగ్రేటేడ్ స్కూళ్ల నిర్మాణం చేపడుతున్నట్టు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందన్నారు. కాంగ్రెస్ అంటే కరెంట్.. కరెంట్ అంటే కాంగ్రెస్ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.