తెలంగాణ పరిశ్రమల భద్రతకు అధిక ప్రాధాన్యత : డీజీపీ

-

తెలంగాణ వాణిజ్య పరిశ్రమల సమాఖ్య ఆధ్వర్యంలో మెరుగైన పోలీస్ నిఘా.. ప్రజా భద్రతపై రాష్ట్ర డీజీపీ జితేందర్ తో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సాంకేతిక పోలీసింగ్, సైబర్ భద్రత, మహిళా ఉద్యోగుల రక్షణ, ప్రభుత్వ ప్రైవేట్ రంగాల భద్రతా సహకారం పై చర్చ జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న డీజీపీ జితేందర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ-ప్రైవేట్ రంగాల మధ్య భద్రత విషయంలో అంతరాన్ని తగ్గించడమే ఈ సమావేశ ఉద్దేశం. పరిశ్రమల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు.

వాణిజ్య రంగంలో మారుతున్న సవాళ్లకు తగినవిధ:గా స్పందించేందుకు తెలంగాణ పోలీస్ శాఖ ముందడుగు వేస్తోందని డీజీపీ తెలిపారు. సైబర్ ఫ్రాడ్ నేరాలను అరికట్టేందుకు ఐజీ ర్యాంకు అధికారిని ప్రత్యేకంగా నియమించవచ్చన్నారు. గంజాయి డ్రగ్స్ నియంత్రణ కోసం నార్కొటిక్స్ బ్యూరో ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. పరిశ్రమల్లో మహిళా ఉద్యోగుల రక్షణ కోసం షీ టీమ్ ఏర్పాటు చేయడం వారి ప్రయాణ సౌకర్యం షీ షటిల్ బస్సులు అందుబాటులోకి తీసుకురావడం వంటి చర్యలను వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news