రాష్ట్ర ప్రయోజనాల కోసం కాంగ్రెస్ ఎంపీలు మాతో కలిసి రాలేదు – ఎంపీ రంజిత్ రెడ్డి

-

పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్ట్ కు అనుమతులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శనివారం ఎంపి రంజిత్ రెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలే యాదయ్య, మహేష్ రెడ్డి, మెతుకు ఆనంద్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ.. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్ట్ కోసం ఏర్పాటు చేసిన కమిటీ పర్యావరణ అనుమతుల కోసం పంపిన రిపోర్ట్ ను రిజెక్ట్ చేయడం పట్ల అసహనం వ్యక్తం చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా అడిగితే ఇవ్వలేదని అన్నారు. కేంద్రంలో ఒకరు, రాష్ట్రంలో ఒకరు ఆధికారంలో ఉంటే ఇలాంటి పరిస్తితి కావాలని కల్పిస్తున్నారని ఆరోపించారు రంజిత్ రెడ్డి. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్ట్ కు జాతీయ హోదా ఇస్తామని అప్పుడు సుష్మా స్వరాజ్ చెప్పారని గుర్తు చేశారు. తాము పర్యావరణ అనుమతుల కోసం రిపోర్ట్ ఇచ్చామని.. కానీ రిపోర్ట్ సరిగా లేదన్నారని పేర్కొన్నారు.

కానీ బిజెపి పాలిత రాష్ట్రాలలో వారికి ఇవేమీ కనిపించని దుయ్యబట్టారు. ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ నుండి అనుమతిలు ఇస్తారని మండిపడ్డారు. ఇక్కడ ప్రతీ ఎకరాకు నీరు ఇస్తాము అనుమతులు ఇవ్వండి అంటే ఇవ్వడం లేదన్నారు. ఇది ముమ్మాటికి కక్ష సాధింపు చర్యేనని ఆరోపించారు. అనుమతులు ఇవ్వాలని బిజెపి నేతలు మోడీని అడగొచ్చు కదా అని నిలదీశారు. ఈ అంశంపై పార్లమెంటులో మాట్లాడడానికి కాంగ్రెస్ ఎంపీలు తమతో కలిసి రాలేదని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news