భారతదేశ రాజకీయాలలో సక్సెస్ అవ్వాలంటే.. ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి. రాజకీయాలలో చాలా మార్గాల ద్వారా, వ్యూహాల ద్వారా ప్రజల ఓట్లను గెలుచుకోవడానికి చూస్తారు. కానీ పాదయాత్ర చేసి నేరుగా ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకోవడం వలన ఎఫెక్ట్ మాములుగా ఉండదు. ఒక నాయకుడు ప్రజల వద్దకు వెళ్లి మీ కష్టం ఏమిటి అని అడిగితే ఇక వారి గుండెల్లో ఆ నాయకుడు దేవుడవుతాడు. అలా పాదయాత్ర చేసి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరియు జగన్ మోహన్ రెడ్డి లు ప్రజల మనసును గెలుచుకున్నారు. ఆ తర్వాత ఈ ఫార్ములాను చాలా మంది ఫాలో అయినప్పటికీ సక్సెస్ రేట్ తక్కువ. ఇప్పుడు తమిళనాడు రాష్ట్రంలోని బీజేపీ అధ్యక్షుడు అన్నామలై రానున్న లోక్ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ మహత్తరమైన ఆలోచనకు శ్రీకారం చుట్టాడు.
ప్రస్తుతం తమిళనాడులో డీఎంకే అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. అన్నామలై జులై 28వ తేదీ నుండి ఎన్ మన్ ఎన్ మక్కల్ పేరుతో రామేశ్వరం నుండి ఇది ప్రారంభము కానుంది. రానున్న లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని గెలిపించడమే లక్ష్యంగా ఈ పాదయాత్ర సాగనుంది.