తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అమ్మకానికి పెట్టారు : పొన్నాల 

-

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అమ్మకానికి పెట్టారని మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. పొన్నాల లక్ష్మయ్యకి కాంగ్రెస్ టికెట్ రాకపోవడంతో పార్టీకి రాజీనామా చేశారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో మాట్లాడుదామని.. చెప్పినప్పటికీ  స్పందించలేదు. ఎక్కడైనా కలిస్తే కనీసం నమస్కారం  కూడా చేయలేదు.  సర్వేల పేరుతో సీట్లు ఎగ్గొట్టే కుట్ర జరుగుతుంది. పార్టీలో చేరని వారికి సర్వే అద్భుతంగా ఉందని.. బీసీ నాయకుల గొంతు కోసే ప్రయత్నం చేశారు.

తాను చాలా ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగానని.. తెలంగాణ రాష్ట్రంలో తొలి పీసీసీగా కొనసాగానని గుర్తు చేశారు. కొత్తగా పార్టీకి వచ్చిన వారు.. భూములు ఇస్తేనో.. విల్లాలు ఇస్తేనో టికెట్లు ఇస్తున్నారు. మల్లికార్జున ఖర్గేకు రాసిన లేఖలో రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ విధానాలను నడుచుకోవడం లేదు.. రెండేళ్లుగా పార్టీలో తనకు అవమానం జరుగుతుందని.. సర్వేల్లో తన పేరు లేదని టికెట్ నిరాకరించారని తెలిపారు పొన్నాల. సొంత పార్టీలో ఉన్నవాళ్లం మేము పరాయి వాళ్లమయ్యామని తెలిపారు పొన్నాల లక్ష్మయ్య. పార్టీలో లేని వ్యక్తులు గెలుస్తారని చెబుతున్నారు. నా లాంటి సీనియర్ నాయకుడు మాట్లాడాలంటే అపాయింట్ మెంట్ కూడా ఇవ్వడం లేదన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version