రైతు రుణమాఫీపై కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం

-

రైతు రుణమాఫీపై తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. రైతు రుణమాఫీపై జనంలోకి కాంగ్రెస్ పార్టీ వెళ్లేందుకు సిద్ధం అయినట్లు సమాచారం. ఇవాళ 2 గంటలకు ప్రజా భవన్ లో పార్టీ డిసిసి అధ్యక్షులు… సీనియర్ నేతలు..ఎంఎల్ఏ..మంత్రులతో సమావేశం జరుగనుంది.

ఈ సమావేశానికి సిఎం రేవంత్.. డిప్యూటీ సిఎం భట్టి హాజరుకానున్నారు. రైతు వేదికల దగ్గర సంబరాలకు పిలుపునిచ్చారు. రేపు సాయంత్రానికి రైతుల ఖాతాలోకి లక్ష రుణమాఫీ కానుంది. ఈ సందర్భంగా ఒకటి, రెండు జిల్లాల రైతులతో సిఎం రేవంత్ మాట్లాడే అవకాశం ఉందని సమాచారం.

కాగా, రుణమాఫీ పై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. రూ. లక్ష జీతం ఉన్నవాళ్లకు రుణమాఫీ కాదని, అలాంటి వారివి 17 వేల ఖాతాలున్నాయని తెలిపారు. అలాగే ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్‌లు, ఇతర ఉన్నతాధికారులకు రుణమాఫీ వర్తించదని స్పష్టం చేశారు. ఈనెల 18న రూ. లక్షలోపు రుణాలు, ఆగస్టు 15లోగా మిగతా రూ. లక్ష రుణమాఫీ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news