Congress Public Meeting : ఇవాళ తుక్కుగూడ లో కాంగ్రెస్ విజయభేరి సభ జరుగనుంది. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ వేదికగా ఆదివారం సాయంత్రం నిర్వహించతలపెట్టిన కాంగ్రెస్ విజయభేరి సభకు సర్వం సిద్ధమైంది. ప్యాబ్ సిటీ సమీపంలోని 100 ఎకరాల విస్తీర్ణంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు.
![Congress Public Meeting At Tukkuguda](https://cdn.manalokam.com/wp-content/uploads/2023/09/Congress-Public-Meeting-At-Tukkugud.jpeg)
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ సహా యువ నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా సిడబ్ల్యుసి ముఖ్యులు, అన్ని రాష్ట్రాలకు చెందిన పిసిసి అధ్యక్షులు, డిసిసిలు, అనుబంధ సంఘాల నేతలు హాజరుకానుండటంతో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఈ సభను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. నియోజకవర్గాల వారీగా భారీగా జన సమీకరణ చేయాలని నేదలకు టార్గెట్లు ఇచ్చింది. ఇందుకోసం 300 బస్సులను కూడా సిద్ధం చేసింది. భారీ వర్షానికి సైతం నేతలు తడవకుండా ఉండేం దుకు రెయిన్ ఫ్రూప్ టెంట్ లను వేశారు.