కాంగ్రెస్ పార్టీ మూడు రోజుల పాటు ఆందోళన జరుగనుంది. నేటి నుంచి ఢిల్లీలోని జంతర్ మంతర్ లో కాంగ్రెస్ మూడు రోజుల పాటు ఆందోళన కొనసాగనుంది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు 5, 6, 7 తేదీల్లో కాంగ్రెస్ ఆందోళనలు నిర్వహించనుంది.

ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్న తెలంగాణ వ్యవహారాల ఇన్ ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యకర్తలు… జంతర్ మంతర్ నిరసనలో పాల్గొననున్నారు.