అశ్వారావుపేట, ఇల్లెందు, రామగుండంలో కాంగ్రెస్‌.. చార్మినార్‌లో ఎంఐఎం గెలుపు

-

తెలంగాణ శాసనసభ ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. ఈ ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీతో దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో మూడు కాంగ్రెస్ పార్టీ ఒకటి ఎంఐఎం దక్కించుకున్నాయి. అశ్వారావుపేటలో హస్తం అభ్యర్థి ఆదినారాయణ బీఆర్ఎస్ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావుపై విజయం సాధించారు. మరోవైపు భద్రాద్రి కొత్తగూడెంలో ఆ పార్టీ అభ్యర్థి కోరం కనకయ్య గెలుపొందారు.

బీఆర్ఎస్ అభ్యర్థి బానోతు హరిప్రియా నాయక్‌పై 25వేలకు పైగా మెజారిటీతో ఆయన విజయం సాధించారు. 2014లో హరిప్రియపైనే గెలిచిన కనకయ్య.. 2018లో ఓటమి పాలయ్యారు. మళ్లీ ఇప్పుడు ఆమెపైనే జయకేతనం ఎగురవేశారు. మరోవైపు రామగుండంలో కాంగ్రెస్‌ అభ్యర్థి మక్కాన్‌ సింగ్‌ రాజ్‌ ఠాకూర్‌ విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి కోరుకంటి చందర్‌పై ఆయన గెలుపొందారు. బెల్లంపల్లిలో బీఆర్ఎస్ అభ్యర్థి దుర్గం చిన్నయ్యపై కాంగ్రెస్‌ అభ్యర్థి గడ్డం వినోద్‌ విజయం సాధించారు. ఇంకోవైపు చార్మినార్‌లో ఎంఐఎం పార్టీ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి మీర్‌ జుల్ఫికర్‌ అలీ గెలిచారు.

Read more RELATED
Recommended to you

Latest news