మధిర నియోజకవర్గం ఎమ్మెల్యే భట్టి విక్రమార్క గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. దాదాపు 2009 నుంచి ఓటమి లేని నేతగా కొనసాగుతున్నాడు. అధికారంలో ఏ పార్టీ ఉన్నప్పటికీ మధిరలో మాత్రం భట్టి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడు. మధిర నియోజకవర్గ ప్రజలు భట్టిని ప్రతీ సారి ఆశీర్వదిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తరపున వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి తరువాత పాదయాత్ర చేసి అంత ప్రజాధరణ పొందిన నాయకుడు భట్టి విక్రమార్క.
ముఖ్యంగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి అవగాహన కలిగిన నాయకుడు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిస్తే.. అందులో బీఆర్ఎస్ పార్టీలో చేరినప్పుడు కష్టకాలంలో పార్టీని కాపాడుకుంటూ కార్యకర్తలను, నాయకులను కాపాడుకుంటూ వచ్చిన నాయకుడు భట్టి విక్రమార్క మాత్రమే. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్ర కాశ్మీర్ నుంచి కన్యకుమారి వరకు చేశాడు. ఇది విజయవంతం అవ్వడంతో తెలంగాణ రాష్ట్రంలో పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు నిర్వర్వామంగా అలుపెరుగని బాటసారిగా 1364 కిలోమీటర్లు 115 రోజుల పాటు పాదయాత్ర చేశారు భట్టి విక్రమార్క.
రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు భరోసా కల్పించే విధంగా తన పాదయాత్ర చేసి రైతులను మహిళలను యువకులను ఇలా పేదవారిని అణగారిన, బలహీన, మైనార్టీ వెనుకబడిన వర్గాల ప్రజలందరినీ కలిసి వారి కష్టాలను విని వారికి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. ఇందిరమ్మ రాజ్యస్థాపనలో వారికే సంక్షేమ పథకాలతో ఏ విధంగా కాంగ్రెస్ అందుకుంటుందని.. అన్ని వర్గాల ప్రజలకు వివరించారు భట్టి విక్రమార్క. మధిరలో 2023 ఎన్నికల్లో భట్టి 33,365 మేజార్టీ సాధించారు.