తెలంగాణ రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. కరెంట్ షాక్ తో కానిస్టేబుల్ మృతి చెందాడు. ఈ సంఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. జయశంకర్ భూపాలపల్లి భూపాల్ పల్లి జిల్లాలో కరెంట్ షాక్ తో కానిస్టేబుల్ ప్రవీణ్ మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు.

కూంబింగ్ చేస్తున్న సమయంలో కరెంట్ షాక్ తో కానిస్టేబుల్ ప్రవీణ్ మృతి చెందాడు. జంతువులను వేటాడేందుకు ఇనుపకంచకు కరెంట్ పెట్టారు దుండగులు. అయితే.. ఆ కరెంటు పెట్టిన విషయాన్ని గుర్తించక పట్టుకున్నాడు కానిస్టేబుల్ ప్రవీణ్. ఈ తరుణంలోనే..కరెంట్ షాక్ తో కానిస్టేబుల్ ప్రవీణ్ మృతి చెందాడు. కాగా కరెంట్ షాక్ తో కానిస్టేబుల్ ప్రవీణ్ మృతి పట్ల విచారణ వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…ఇనుప కంచె పెట్టిన దుండగులను పట్టుకోవాలని ఆదేశించారు.