హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి పారాగ్లైడింగ్ చేస్తూ ప్రమాదవశాత్తు మృతి చెందారు. ఈ విషాదకర ఘటన హిమాచల్ ప్రదేశ్‌లోని కులూలో జరిగింది. సెఫ్టీ బెల్ట్‌ను తనిఖీ చేయకుండానే అనుమతించడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ క్రమంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పారాగ్లైడింగ్ పైలట్‌ను అరెస్టు చేశారు.
ఈ ఘటనపై కులూ పర్యాటక శాఖ అధికారిణి సునైన శర్మ స్పందిస్తూ.. మానవ తప్పిదమే ఈ దురదృష్టకర సంఘటనకు దారితీసి ఉండొచ్చని అన్నారు. పారాగ్లైడింగ్ చేసిన ప్రదేశం, ఎక్విప్‌మెంట్‌కు అనుమతి ఉందని, పైలట్‌కు రిజిస్ట్రేషన్ ఉందని తెలిపారు. వాతావరణ సమస్యలు కూడా లేవన్న సునైన.. ఈ ప్రమాదంతో ప్రస్తుతం అక్కడ పారాగ్లైడింగ్‌ను సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. ఐపీసీ సెక్షన్ 336, 334 కింద పైలట్‌పై పోలీసులు కేసు నమోదు చేశారని చెప్పారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు అధికారిణి సునైన శర్మ చెప్పారు. మృతి చెందిన టూరిస్టు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.