కానిస్టేబుల్ నాగమణి హత్య కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆస్తి కోసమే అక్కను చంపాడట తమ్ముడు పరమేష్. నాగమణికి ఇది వరకే వివాహం, విడాకులు అయ్యాయట. తమ వారసత్వ భూమిని మొదటి వివాహం తర్వాత తమ్ముడికి ఇచ్చిందట నాగమణి.
ఇక రెండవ భర్త శ్రీకాంత్ ను కులాంతర వివాహం చేసుకున్న తర్వాత తమ్ముడికి ఇచ్చిన భూమి తిరిగి తనకు ఇవ్వాలంటూ ఒత్తిడి చేసిందట. ఈ క్రమంలోనే స్కూటీ పై డ్యూటీకి వెళ్తున్న నాగమణిని కారుతో ఢీకొట్టి కత్తితో హత్య చేశాడట తమ్ముడు పరమేష్.
ప్రేమ వివాహం చేసుకుందనే అక్క నాగమణిని చంపాడు తమ్ముడు పరమేష్. నవంబర్ లో ప్రేమ వివాహం చేసుకున్నారు శ్రీకాంత్, నాగమణి. వివాహం అనంతరం హయత్ నగర్ లో నివాసం ఉంటోంది జంట. ఇక నిన్న సెలవు కావడంతో సొంత గ్రామానికి వెళ్ళింది నాగమణి. నాగమణిని వెంబడించి మొదట కారుతో ఢీకొట్టాడు తమ్ముడు పరమేశ్. అనంతరం కొడవలితో మెడ నరికి హత్య చేశాడు. పరమేష్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు.