రాష్ట్రంలో రాజ్యసభ సభ్యుల ఎన్నిక ప్రక్రియ పొలిటికల్ హీట్ ను పుట్టిస్తోంది. ఏ పార్టీ నుంచి ఎవరెవరు బరిలోకి దిగబోతున్నారని అంశంపై అన్ని పార్టీల నేతల్లో ఉత్కంఠ నెలకొన్నది. మూడు రాజ్యసభ స్థానాలకు ఇప్పటికే టిడిపి, జనసేన, బిజెపి పార్టీలోని ముఖ్య నేతలు ఎవరికి వారుగా ఢిల్లీకి వెళ్లి జోరుగా లాబీయింగులు చేస్తున్నారు. ఈ తరుణంలోనే తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన ఆరోపణలు చేశారు.
తన అన్న నాగబాబు కి రాజ్యసభ సీటు ఇప్పించేందుకు ఢిల్లీకి వెళ్లి మతనాలు చేశారని ఆక్షేపించారు. ఆనాడు కేంద్రమంత్రి పదవి కోసం చిరంజీవి పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారని..b నేడు పవన్ కూడా బీజేపీతో ఆ విధంగానే వ్యవహరిస్తున్నారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు కేఏ పాల్. వారికి కుటుంబ స్వార్ధం తప్ప మరేదీ పట్టదని పవన్ కళ్యాణ్ పై కేఏ పాల్ ఫైర్ అయ్యారు. ప్రస్తుతం కె పాల్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి