శాంతియుతంగా నిరసన చేసిన ఏబీవీపీ మహిళా కార్యకర్తపై పోలీసుల దాడి అమానుషమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘటన సిగ్గుచేటని…. పోలీసులు వెంటనే బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు జాతీయ మానవ హక్కుల సంఘం జోక్యం చేసుకోవాలంటూ ట్వీట్ చేశారు.
కాగా, హైదరాబాద్ రాజేంద్రనగర్ వ్యవసాయ యూనివర్సిటీలో అమానవీయ సంఘటన చోటుచేసుకుంది.ABVP మహిళా కార్యకర్తపై HYD పోలీసులు ప్రవర్తించిన తీరు విమర్శలకు దారితీసింది. వ్యవసాయ ఉద్యాన వర్సిటీ భూముల జీవో నెం.55 వెనక్కి తీసుకోవాలని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారికి ఏబీవీపీ నేతలు మద్దతిస్తూ నిరసన చేపట్టారు. ఇందులో పాల్గొన్న ఓ కార్యకర్తను బైక్ పై వెంబడించిన కానిస్టేబుళ్లు జుట్టు పట్టుకుని లాగారు. దీంతో ఆమె కిందపడిపోయింది. ఈ ఘటనపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవు తున్నాయి. అటు ఏబీవీపీ మహిళా కార్యకర్తపై పోలీసుల దాడి అమానుషమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు.