Mary Kom : బాక్సింగ్‌కు మేరీ కోమ్ వీడ్కోలు..

-

Mary Kom : బాక్సర్‌ మేరీ కోమ్ సంచలన ప్రకటన చేశారు. బాక్సింగ్ కు మేరీకోమ్ వీడ్కోలు పలికారు. ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్ మేరీకోమ్ ఆటకు వీడ్కోలు పలికారు. 2012 ఒలంపిక్స్ పతక విజేత అయిన మేరీకోమ్ తన వయసు దృష్ట్యా రిటైర్మెంట్ ప్రకటించినట్లు తెలిపారు. వయో పరిమితిని కారణంగా పేర్కొంటూ క్రీడలనుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు.

Indian boxing legend Mary Kom retires

ఈ ప్రకటనతో భారత బాక్సింగ్ లో స్వర్ణయుగం ముగిసింది. 41 ఏళ్ల మేరీకోమ్ తన కెరీర్ లో ఎన్నో మైలురాళ్లను అధిగమించారు. తనకు బాక్సింగ్ నుంచి వైద్యులగాలని లేదని, వయోపరిమితి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. బాక్సింగ్ రూల్స్ ప్రకారం ఎలైట్ లెవెల్ లో ఆడాలంటే ఎవరికైనా 40 ఏళ్ళే గరిష్ట వయోపరిమితి. ప్రస్తుతం మేరీ వయసు 41 కావడంతో తను ఆట నుంచి తప్పక వైదొగాల్సి వచ్చింది. తనకు ఇంకా ఆడాలని ఉందని…. దురదృష్టవశాత్తు వయస్సు తన ఆటకు అడ్డంకిగా మారిందని మేరీకోమ్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news