బొడిగె శోభను, వారి కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్

-

బొడిగె శోభను, వారి కుటుంబాన్ని పరామర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్. తీవ్ర అనారోగ్యంతో ఇటీవలే మరణించిన తెలంగాణ ఉద్యమకారుడు, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ భర్త గాలన్న చిత్రపటానికి బుధవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.

KTR visited Bodige Shobha and their family

బొడిగె శోభను, వారి కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. వారి వెంట బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఇక అటు రోడ్డు పక్కన హోటల్ లో మిర్చి బజ్జి రుచి చూశారు కేటీఆర్. కరీంనగర్ పర్యటన ముగించుకొని హైదరాబాద్ వెళుతున్న ఆయన మార్గమధ్యలో మానకొండూర్ నియోజకవర్గం కొత్తపల్లి వద్ద ఓ హోటల్ దగ్గర ఆగారు. మహిళను అడిగి ఓ మిరపకాయ బజ్జీని తీసుకొని తిన్నారు. ఆ తర్వాత చాయ్ తాగి కాసేపు కూర్చొని ముచ్చటించారు. ఈ క్రమంలో కేటీఆర్ ను చూసేందుకు ప్రజలు ఆసక్తి చూపారు.

Read more RELATED
Recommended to you

Latest news