తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ విశ్వరూపం చూపిస్తుంది. ప్రతి రోజు అందరినీ ఆశ్చర్య పరుస్తూ విపరీతంగా కేసులు పెరుగుతున్నాయి. తాజా గా ఈ రోజు కూడా 2,606 కేసులు నమోదు అయ్యాయని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తమ కరోనా బులిటెన్ లో తెలిపారు. ఈ బులిటెన్ ప్రకారం ఒక్క రోజే 2,606 కేసులు నమోదు అయ్యాయి. ఇందులో కేవలం జీహెచ్ ఎంసీ పరిధి లోనే 1,583 కేసులు నమోదు అయ్యాయి. దీంతో హైదరాబాద్ పట్టణ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జీహెచ్ ఎంసీ ప్రాంతంలో రోజు రోజుకు కేసుల సంఖ్య విపరీతంగా పెరుగడం అధికారులకు కూడా టెన్షన్ గా మారింది. అలాగే గడిచిన 24 గంటలల్లో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కాటుకు ఇద్దరు మృతి చెందారు. అలాగే ఈ రోజు రాష్ట్రం వ్యాప్తంగా కరోనా మహమ్మారి బారి నుంచి 285 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ప్రస్తుతం 12,180 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు పెరుగుతన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రజలకు సూచించారు. కరోనా నిబంధనలను తప్పక పాటించాలని సూచించారు.