నకిలీ డాక్యుమెంట్ సృష్టించిన కేసులో కార్పొరేటర్ అరెస్ట్..!

-

నకిలీ డాక్యుమెంట్ సృష్టించిన కేసులో కార్పొరేటర్ ను మీర్ పేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. పొలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మీర్ పేట్ కార్పొరేషన్ చెందిన 13వ డివిజన్ కార్పొరేటర్ నరేందర్ కుమార్  చంపాపేట్ కు చెందిన కృష్ణ అనే వ్యక్తికి కొంగర కలన్ లో ఉన్నటువంటి భూమికి సంబంధించిన నకిలీ డాక్యుమెంట్స్ చూపించి 5 కోట్ల రూపాయలకు నరేందర్ కుమార్ ఓ భూమిని అగ్రిమెంట్ చేశాడు. అగ్రిమెంట్ చేసిన భూమిని రిజిస్ట్రేషన్ చేయించు అ అడగడంతో నరేంద్ర కుమార్ రిజిస్ట్రేషన్ చేయించకపోవడంతో కృష్ణ కు అనుమానం వచ్చింది.

భూమికి సంబంధించిన సదురు భూ యజమానిని వివరాలు తెలుసుకొని సంప్రదించగా.. మా భూమి ఎవరికి అమ్మలేదు. మేము ఎవరి వద్ద డబ్బులు తీసుకోలేదని భూ యజమాని చెప్పడంతో నకిలీ డాక్యుమెంట్స్ తో మోసపోయాను అని గమనించిన బాధితుడు మీర్ పేట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు   నరేందర్ కుమార్ ని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్టు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news