హరితహారం చెట్లను నరికిన బిల్డర్.. జరిమానా విధించిన ఫారెస్ట్ అధికారులు

-

రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన హరితహారం అబాసుపాలు అవుతోంది. ఈ క్రమంలోనే నగరంలోని మచ్చబొల్లారంలో గల లక్ష్మీ ఎంక్లేవ్ సిమ్మింగ్ పూల్డ్కు వెళ్లే దారిలో జీహెచ్ఎంసీ అధికారులు రోడ్డుకు ఇరువైపులా మొక్కలను నాటారు. అయితే, ఆ మొక్కలు చెట్లు కాగా.. అపార్ట్మెంట్ నిర్మాణాలకు అడ్డుగా వస్తున్నాయని ఎలాంటి అనుమతి లేకుండా ఓ బిల్డర్ 20 చెట్లను ఇష్టానుసారంగా నరికేశాడు.

ఈ విషయం గురించి జీహెచ్ఎంసీ అధికారుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు చెట్లు నరికిన బిల్డర్ కి  రూ.15,990 రూపాయల వరకు జరిమానా విధించారు. వాటిని ఆ బిల్డర్ వెంటనే చెల్లించలేదు. తరువాత నెల రోజులలోపు చెల్లిస్తానని హామి ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news